Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆ రంగాల్లో పెట్టుబడితోనే స్థిరమైన అభివృద్ధి

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌
న్యూదిల్లీ : కరోనా కారణంగా దెబ్బతిన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి, స్థిరమైన వృద్ధిని సాధించడానికి దేశంలోని ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను పెంచాల్సిన అవసరముందని భారత రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. బుధవారం దిల్లీలోని నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగిస్తూ…కరోనా మహమ్మారి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేద ప్రజలను అధికంగా ప్రభావితం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తూ స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి అందరం ప్రయత్నాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధించాలంటే ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆవిష్కరణలు, మౌలికసదుపాయాల కల్పనా రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయని స్పష్టం చేశారు. తద్వారా మార్కెట్‌లో పోటీ తత్వం, చైతన్యాన్ని ప్రోత్సహించవచ్చునని చెప్పారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు సృష్టించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థిరమైన వృద్ధిని సాధించేలా పెట్టుబడులు పెట్టగలిగిన సంస్థలు నిర్మాణాత్మకంగా కృషి చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img