Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆ రాష్ట్రాల్లో తొలి డోసు పూర్తి

వేగంగా కోవిడ్‌ వాక్సినేషన్‌
కేంద్రం మంత్రి మన్సుఖ్‌ మాండవ్య

న్యూదిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవ్య తెలిపారు. దేశంలోని వయోజనుల్లో 75 శాతం మందికిపైగా తొలిడోసు వాక్సిన్‌ను అందుకున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వయోజనులందరికీ తొలి డోసు వాక్సిన్‌ పూర్తియినట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు సహా అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, లక్షద్వీప్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, దాద్రా నగర్‌ హవేలిలలోని వయోజనులందరూ తొలిడోసును పొందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాలో నమోదైనట్టు పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా 31 శాతం మందికి పైగా రెండు డోసుల వాక్సిన్‌ను అందుకున్నట్టు తెలిపారు. తొలి డోసు తీసుకున్న వారందరూ తప్పకుండా రెండో డోసును పొంది వైరస్‌బారినపడకుండా రక్షించుకోవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ 103.5 కోట్లకు వాక్సిన్‌ డోసులను సరఫరా చేయగా 10.85 కోట్ల డోసుల వాక్సిన్‌లు రాష్ట్రాల వద్ద పంపిణీకి సిద్దంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img