Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆ రూ.4లక్షల కోట్లు రాష్ట్రాలకివ్వాలి..

కేంద్రానికి మమత డిమాండు
న్యూదిల్లీ : పెంచిన ఇంధనం/చమురు ధరల ద్వారా వచ్చిన రూ.4లక్షల కోట్లను రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రాన్ని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మంగళవారం డిమాండు చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో మమత స్పందించారు. ఇటీవల పెరిగిన చమురు ధరల నుంచి సేకరించిన రూ.4లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంచాలని డిమాండు చేశారు. ‘వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ను అధిక ధరలకు విక్రయించి పన్నుల రూపేణ దాదాపు రూ.4లక్షలకోట్లను కేంద్రం పొందింది. ఇప్పుడు వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. అలా చేస్తే రాష్ట్రాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? కేంద్రం ఆ రూ.4లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంచాలి’ అని బెంగాల్‌ అసెంబ్లీలో మమత అన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ అనేక సబ్సిడీలను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. ‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా వారు (కేంద్రం) ధరలు తగ్గిస్తారు. అవి ముగియగానే మరలా పెంచేస్తారు. ఇంధనం ధరల గురించి సలహాలిచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు డుబ్బు ఎక్కడ నుంచి వస్తుందో చెప్పాలి. కేంద్రం నిధులను కాదు అప్పులు ఇస్తుంటుంది’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేవారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోతే ఆందోళన చేపడతామన్న బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిరచారు. వాక్సిన్‌ల పంపిణీలోనూ పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చినదానికంటే చాలా తక్కువ వాక్సిన్‌లు బెంగాల్‌కు ఇచ్చారు. ఒక్క మొతాదు కూడా వృధా కానివ్వలేదని మమత నొక్కిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img