Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇండియాలో న్యూస్‌ వెబ్‌సైట్లు మూసివేసిన యాహూ

యహూ సంస్థ భారత్‌లో న్యూస్‌ వెబ్‌సైట్‌ను మూసివేసింది. తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పు రావడంతో యహూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో యాహూ న్యూస్‌, యాహూ క్రికెట్‌, ఫైనాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మేకర్స్‌ ఇండియా లాంటి సైట్లను షట్‌డౌన్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎఫ్‌డీఐలో వచ్చిన కొత్త రూల్స్‌ ప్రకారం.. భారత్‌లోని డిజిటల్‌ కంటెంట్‌ పబ్లిష్‌, ఆపరేషన్‌ మీద మీడియా కంపెనీల ఫారెన్‌ ఓనర్‌షిప్‌ లిమిట్‌ను తగ్గించారు. ఆ లిమిట్‌ దాటితే.. ఎఫ్‌డీఐ చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. అందుకే.. యాహూ..భారత్‌లో తన న్యూస్‌ సైట్లను అన్నింటినీ.. ఆగస్టు 26, 2021 నుంచి షట్‌డౌన్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే యాహూ ఈమెయిల్‌, యాహూ సెర్చ్‌ మాత్రం యధావిధిగా నడవనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img