Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఇండియా గేట్‌ వద్ద నేతాజీ విగ్రహం

ప్రధాని మోదీ
న్యూదిల్లీ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని, భారతదేశం ఆయనకున్న ‘రుణ భావానికి’ చిహ్నంగా ఇండియా గేట్‌ వద్ద దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. గ్రానైట్‌తో చేసిన విగ్రహం పూర్తయ్యే వరకు, అదే స్థలంలో ఆయన హోలోగ్రామ్‌ విగ్రహం ఉంటుందని, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకుడి జయంతి జనవరి 23న హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పారు. ‘దేశమంతా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో ఇండియా గేట్‌ వద్ద గ్రానైట్‌తో చేసిన ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది ఆయనకు దేశం రుణపడి ఉండేందుకు చిహ్నంగా ఉంటుంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. గ్రానైట్‌ విగ్రహం పరిమాణం 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. దాని సంస్థాపన భారతదేశం తన చరిత్రను ‘పునరుద్ధరించడానికి’ ఒక సందర్భం అని పేర్కొంది. 1968లో తొలగించబడిన కింగ్‌ జార్జ్‌`4 విగ్రహాన్ని కలిగి ఉన్న ఛత్రం కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఇక్కడి ఇండియా గేట్‌ వద్ద ఉన్న అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద మంటలను ఆర్పి, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న అమర జ్వాలలో కలపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శించిన రోజునే ఈ ప్రకటన వెలువడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img