Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇంధన ధరల తగ్గింపునకు కృషి : కేంద్రం

న్యూదిల్లీ: పెట్రోలు, డీజిలు ధరల తగ్గింపుపై ఆర్థికశాఖతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఇంధన ధరలను అదుపు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్‌ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని, ఇందుకోసం సౌదీ అరేబియా మొదలు రష్యా వరకు చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడిరచాయి. దేశంలోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు 90 రోజుల స్థాయి కన్నా స్వల్పంగా తగ్గాయని తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img