Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇకపై స్విగ్నీ, జొమాటోలో 5శాతం జీఎస్టీ

న్యూదిల్లీ : స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు శనివారం నుంచి ఐదు శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. వాటిని నేరుగా ప్రభుత్వానికి పంపుతాయి. జీఎస్టీ పరిధిలో లేని వారు కూడా దాని పరిధిలోకి రానున్న క్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందించే ఆహార విక్రేతల ట్యాక్స్‌ బేస్‌ విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతానికి జీఎస్టీ కింద నమోదు అయిన రెస్టారెంట్లు పన్ను వసూలు, జమ చేస్తున్నాయి. క్యాబ్‌ సేవలు అందించే ఊబర్‌, ఓలా వంటి సంస్థలు కూడా ఐదు శాతం జీఎస్టీని శనివారం నుంచి ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సేవలపై వసూలు చేస్తున్నాయి. 12 శాతం జీఎస్టీ అమలుతో చెప్పుల ధరలు పెరిగాయి. ఈ మేరకు మార్పులు కొత్త సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. పన్ను ఎగవేతలను నివారించేందుకు జీఎస్టీ చట్టాన్ని సవరించారు. పన్ను చెల్లింపుదారు జీఎస్టీఆర్‌ 2 బిలో క్రెడిట్‌ కనిపించినప్పుడు మాత్రమే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అందుబాటులోకి వచ్చేలా చట్ట సవరణ జరిగింది. ఐదు శాతం ప్రొవిజనల్‌ క్రెడిట్‌కు జనవరి 1 నుంచి అనుమతి లేదు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే జీఎస్టీ చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌ ఆహారాన్ని సరఫరా చేసే స్విగ్గీ, జోమాటో సేవలపై ఐదు శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. క్లౌడ్‌ కిచెన్‌లు, సెంట్రల్‌ కిచెన్‌ల సేవలు రెస్టారెంట్‌ల పరిధిలోకి రాగా శనివారం నుంచి ఐదు శాతం సేవల పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. జీఎస్టీ పన్ను చెల్లించని రెస్టారెంట్లపై కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించింది. గతంలో రెస్టారెంట్లు పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి ఇచ్చేవిగానీ ఇప్పుడు వాటిని ట్యాక్స్‌మెన్‌కు చెల్లించే బాధ్యత స్విగ్గీ, జోమాటోలపై ఉంది. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫారంల జాబితాలోని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్నప్పటికీ ఆ పన్నులను ఎగవేస్తున్నట్లు క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసి డబ్బులు చెల్లించే సమయంలో జీఎస్టీ పేరిట అదనపు చార్జీలు వసూలు చేసే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికే కస్టమర్ల నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్న రెస్టారెంట్లు, అందులో కొంత ఫుడ్‌ డెలివరీ కంపెనీలకు ఇచ్చేవిగానీ ఇకపై నేరుగా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img