Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇక రైల్వేస్టేషన్లలో పౌర సేవలు

200 సీఎస్‌సీ కియోస్క్‌ల ఏర్పాటు
గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా 200 రైల్వేస్టేషన్‌లలో ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్‌టెల్‌ కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) కియోస్క్‌లను త్వరలో ఏర్పాటు చేయనుంది. వీటి సహాయంతో ప్రయాణీకులు తమ మొబైల్‌లను రీచార్జ్‌ చేయగలరు… విద్యుత్‌ బిల్లులు చెల్లించగలరు… ఆధార్‌, పాన్‌ కార్డ్‌ ఫారాలను పూరించగలరు… పన్నులు కూడా కట్టేయొచ్చు. ఈ పథకం ‘సిఎస్‌సి ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌’ (సిఎస్‌సి`ఎస్‌పీవీ), ఎలక్ట్రానిక్స్‌ Ê ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో రూపొందించినట్లు రైల్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కియోస్క్‌లను గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు (వీఎల్‌ఈ) నిర్వహిస్తారు. ‘‘సీఎస్‌సీ ద్వారా అందించే సేవల్లో ప్రయాణ టికెట్ల బుకింగ్‌ (రైలు, విమానం, బస్సు మొదలైనవి), ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డ్‌, మొబైల్‌ రీచార్జ్‌, విద్యుత్‌ బిల్లు చెల్లింపు, పాన్‌ కార్డ్‌, ఆదాయపు పన్ను, బ్యాంకింగ్‌, బీమా, మరెన్నో ఉన్నాయి’ అని ప్రకటన పేర్కొంది. కియోస్క్‌లకు ‘రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌లు’గా పేరు పెట్టారు. రైల్‌వైర్‌ అనేది రైల్‌టెల్‌ రిటైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవ బ్రాండ్‌ పేరు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్‌ సిటీ స్టేషన్‌లలో రైల్‌వైర్‌ సాథీ సీఎస్‌సీ కియోస్క్‌లు ప్రయోగాత్మకంగా ప్రారంభించబడ్డాయి. త్వరలో దశలవారీగా ఇలాంటి కియోస్క్‌లు దాదాపు 200 రైల్వే స్టేషన్లలో, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తాయని ప్రకటన వివరించింది. వీటిలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 44, ఉత్తర సరిహద్దు రైల్వేలో 20, తూర్పు మధ్య రైల్వేలో 13, పశ్చిమ రైల్వేలో 15, ఉత్తర రైల్వేలో 25, పశ్చిమ మధ్య రైల్వేలో 12, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 13, ఈశాన్య రైల్వేలో 6 ఉన్నాయి. ‘మౌలిక సదుపాయాలు/వనరుల కొరతతో పాటు ఇంటర్నెట్‌ని ఉపయోగించే పరిజ్ఞానం లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు వివిధ ఇ-గవర్నెన్స్‌ సేవలను పొందలేరు.. ఈ రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌లు గ్రామీణ రైల్వేలో ఈ అవసరమైన డిజిటల్‌ సేవలను అందిస్తాయి. గ్రామీణ జనాభాకు మద్దతుగా స్టేషన్లు ఉంటాయి’ అని రైల్‌టెల్‌ సీఎండీ పునీత్‌ చావ్లా పేర్కొన్నారు. ‘రైల్‌వేర్‌’ బ్రాండ్‌ పేరుతో రైల్‌టెల్‌ 6,090 స్టేషన్లలో పబ్లిక్‌ వైఫై ఏర్పాటు చేసింది. ఇందులో 5వేల స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. స్టేషన్లలో ఇప్పటికే ఉన్న ఈ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని రైల్‌టెల్‌, సీఎస్‌సీ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించాలని యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img