Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఇది ప్రభుత్వాల సమిష్టి కృషికి ఫలితం కాదా..?

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ జలప్రవేశంపై జైరాం రమేష్‌ ప్రశ్న
దేశీయంగా తయారైన తొలి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌక నౌకా దళంలోకి చేరిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. 1999 నుంచి పలు ప్రభుత్వాల సమిష్టి ప్రయత్నాలతోనే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌకాదళంలోకి తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారా అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రశ్నించారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నేడు నౌకా దళంలోకి ప్రవేశించడం 1999 నుంచి పలు ప్రభుత్వాలు సాగించిన సమిష్టి కృషికి ఫలితం కాదా అని ఆయన ప్రధాని మోదీని నిలదీశారు. 1971 యుద్ధంలో భారత్‌కు ఎంతో ఉపయోగపడిన అసలైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను కూడా గుర్తుచేసుకోవాలని అన్నారు. బ్రిటన్‌ నుంచి దానిని తీసుకురావడంలో కృష్ణ మీనన్‌ కీలక పాత్ర పోషించారని జైరాం రమేష్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాగా దేశీయంగా తయారైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ శుక్రవారం భారతీయ నౌకాదళంలోకి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ యుద్ధ నౌకను జలప్రవేశం చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img