Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్‌ థాకరే

శివసేన పార్టీ పేరు, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఉద్ధవ్‌ థాకరే వర్గం (యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాధారణ బెంచ్‌ ముందు ముందస్తు విచారణను కోరడం ప్రస్తుతం ఉద్ధవ్‌ శిబిరం యొక్క వ్యూహం. అయితే, ఈ విషయంపై కోర్టు ఎప్పుడు విచారణ ప్రారంభిస్తుందనేదానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఈ కేసును షెడ్యూల్‌ లేకుండా అత్యవసర విచారణ చేపట్టాలని థాకరే వర్గం తరఫు న్యాయవాది కోరారు. దీనికి ఒప్పుకోని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సరైన పేపర్‌ వర్క్‌ తో రేపు అత్యవసర విచారణ జాబితాలో ప్రవేశ పెట్టాలని సూచించారు. శివసేన నుంచి గెలిచిన వారిలో 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది, 18 మంది లోక్‌సభ సభ్యులలో 13 మంది మద్దతును కలిగి ఉన్న షిండే వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయించడంతో ఉద్ధవ్‌ థాకరేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసే వరకు గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వులో ఇచ్చిన శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే) పేరును, ాజ్వలించే కాగడా్ణ ఎన్నికల చిహ్నాన్ని థాకరే వర్గం ఉపయోగించుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. 1966లో బాలాసాహెబ్‌ థాకరే స్థాపించిన పార్టీపై ఠాక్రే కుటుంబం పట్టు కోల్పోవడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img