Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఈ జంట విడిపోయింది !

ఐఏఎస్‌ టాపర్స్‌ జంట టీనా దాబి, అథార్‌ అమిర్‌ ఖాన్‌ విడాకులు తీసుకుని.. దేశవ్యాప్తంగా మళ్లీ వార్తల్లో నిలిచారు.ఐఏఎస్‌ పరీక్షలో ఒకటి, రెండు ర్యాంకులు సాధించిన వీరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి 2018లో పెళ్లి చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈ జంట విడాకులు తీసుకుంది. ఇష్టపూర్వకంగా ఇద్దరూ గతేడాది నవంబర్‌లో విడాకుల కోసం.. జైపూర్‌లోని ఫ్యామిలీ కోరును ఆశ్రయించగా.. ఇప్పుడు విడాకులు మంజూరయ్యాయి. శిక్షణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఐఏఎస్‌ అధికారులుగా మారిన అనంతరం వారిద్దరూ 2018లో ఘనంగా వివాహం చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో ఆ పెళ్లిని పలు మత సంఘాలు తప్పుబట్టాయి. అయినా వారు వెనకడుగు వేయకుండా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ వంటి ప్రముఖలు హాజరయ్యారు. రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన వీరిద్దరూ జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.. ప్రేమలోనూ.. పాలనలోనూ విజయవంతంగా రాణించిన ఈ జంట తాజాగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img