Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈ నెల 24 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నిపథ్‌ నియామకాలు!

భారత త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ పథకం కింద నియామకాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన ద్వారా తెలిపారు. 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని వీఆర్‌ చౌధరి చెప్పారు అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలను చేపట్టలేదని… అందువల్ల గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచినట్టు తెలిపారు. మరోవైపు త్వరలోనే నియామకాలను చేపడుతున్నట్టు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడిరచిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img