Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈ సాయంత్రానికి బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
ఇది మరింత పుంజుకుంటోందన్న ఐఎండీ
రేపటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను
మే 11 వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సముద్రాన్ని ఆనుకుని నిన్న ఏర్పడిన అల్పపీడనం, ఈ ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేటి సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఆ తర్వాత మరింత పుంజుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు (మే 10) తుపానుగా రూపాంతరం చెందుతుందని వెల్లడించింది.ఈ తుపాను (మోచా) మే 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్కడ్నించి క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img