Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థుల కేసును మరోసారి వాయిదా వేసిన సుప్రీం

ఉక్రెయిన్‌ వైద్య విద్యార్ధుల కేసును సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను నవంబర్‌ 1న జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్దాబోస్‌ ధర్మాసనం చేపట్టనుంది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్దులు పడుతున్న బాధనలను న్యాయవాదులు మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది విద్యార్ధులు ఐదేళ్లు పూర్తి చేసుకుని, కేవలం క్లినికల్‌ పరీక్షల కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. అవకాశం ఉన్నంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనాన్ని విద్యార్ధుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కోసం చూస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. సొలిసిటర్‌ జనరల్‌ స్పందించిన తదుపరి నిర్ణయం ప్రకటించనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img