Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉచితంగా ప్రికాషన్‌ డోస్‌ – అన్ని రాష్ట్రాల సీఎస్‌కు కేంద్రం ప్రత్యేక సూచనలు !

అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ,జల్‌ జీవన్‌ మిషన్‌,కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ , నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన అంశాలపై శుక్రవారం ఢల్లీి నుండి కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన అంశాలపై సీఎస్‌ లతో సమీక్షించారు.
ఉచిత ప్రికాషన్‌ డోస్‌ పంపిణీకి ఏర్పాట్లు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజులపాటు నిర్వహించే కోవిడ్‌ ప్రికాషన్‌ డోస్‌ పంపిణీ కార్యక్రమంపై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున అమలు చేసి 18ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. గ్రామ పంచాయితీలు, మున్సిపల్‌ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని రాజీవ్‌ గౌబ సిఎస్‌లకు చెప్పారు. అంతేగాక ప్రభుత్వ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ద్వారా వ్యాక్సిన్‌ అందించాలని, రైల్వే స్టేషన్లు,బస్సు స్టేషన్లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వ్యాక్సిన్‌ అందించే సమయంలో అన్ని పాఠశాలలు,కళాశాలు,విశ్వవిద్యాలయాలు వంటి అన్ని విద్యా సంస్థలు తెరచి ఉంచేలా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సిఎస్‌లను కేబినెట్‌ కార్యదర్శి రాజీవ గౌబ ఆదేశించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కు సంబంధించి 1000 కోట్ల రూ.లకు డిపిఆర్లు సిద్ధం చేసి అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చామని ఈ నెలలో ఆ నిధులు కూడా విడుదల చేస్తామని కేబినెట్‌ కార్యదర్శికి ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img