Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఉత్తరకాశీ హిమపాతం.. 9 మంది పర్వతారోహకుల మృతదేహాలు లభ్యం

ఉత్తరాఖండ్‌లోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌కు చెందిన 29 మంది ట్రెయినీ పర్వతారోహకులు.. గత మంగళవారం ఉత్తరకాశీలోని ఓ పర్వతాన్ని ఆధిరోహిస్తుండగా భారీ హిమపాతం సంభవించడంతో గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్స్‌ చేపట్టిన గాలింపుల్లో ఇప్పటివరకు 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన మంగళవారం రోజే నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, తర్వాత మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగు మృతదేహాలను మంగళవారం రోజే పర్వతం పైనుంచి కిందకు తీసుకురాగా, మిగతా ఐదు మృతదేహాలను ఇవాళ కిందకు తీసుకొచ్చారు. మిగతా 20 మంది కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌, స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ తదితర బలగాలు రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయి. వారికి సహాయంగా మరికొన్ని బృందాలను అడ్వాన్స్‌ బేస్‌ క్యాంపునకు పంపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img