Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకున్న 28 మంది ట్రైనీలు

ఉత్తరాఖండ్‌లోని ఘర్‌వాల్‌ హిమాలయ ప్రాంతంలోని గంగోత్రి సమీపంలో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. ద్రౌపది దండా-2 పర్వతం వద్ద కొండచరియలు కూలిపడ్డాయి. అయితే ఆ ప్రాంతంలో నెహ్రూ మౌంటెనీరింగ్‌ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన 28 మంది ట్రైనీలు చిక్కుకున్నట్లు తెలిసింది. తక్షణమే సహాయక చర్యలను చేపట్టినట్లు సీఎం పుష్కర్‌ సింగ్‌ థామి తెలిపారు. నెహ్రూ మౌంటెనీరింగ్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఉత్తరకాశీలో ఉంది. కొండచరియల్లో చిక్కుకున్న ట్రైనీలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, ఐటీబీపీ దళాలు వెళ్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్‌ థామి తెలిపారు. 40 మందితో కూడిన ఓ బృందం ట్రెక్కింగ్‌కు వెళ్లింది. దీంతో 33 మంది ట్రైనీలు, ఏడు మంది ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం 8 మందిని రక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img