Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉత్తరాఖండ్‌కు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు : మోదీ

డెహ్రాడూన్‌: ఉత్తరప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు గానీ లేదా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గానీ ఉత్తరాఖండ్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని రాష్ట్ర ప్రజలను ఆయన హెచ్చరించారు. ఎవరికి అధికారం ఇస్తే ఉత్తరాఖండ్‌కు మేలు జరుగుతుందో ఆలోచించాలని విన్నవించారు. ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మోదీ మంగళవారం నైనిటాల్‌లో వర్చువల్‌ ర్యాలీలో ప్రసంగించారు. రెండిరజన్ల ప్రభుత్వానికి ఓటేయాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం తమకు కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదని, ప్రాజెక్టులు నిలిచిపోయాయని, అవినీతి విలయతాండవం చేసిందని ఆరోపిస్తూ ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలను ఓడిరచాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీని ప్రస్తావిస్తూ ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img