Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉత్తరాఖండ్‌ నూతన గవర్నర్‌గా గుర్మీత్‌సింగ్‌ ప్రమాణం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ నూతన గవర్నర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) గుర్మీత్‌ సింగ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ రాజ్‌ భవన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎస్‌.చౌహాన్‌.. గుర్మీత్‌ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, ఆయన మంత్రివర్గ సభ్యులు సత్పాల్‌ మహరాజ్‌, ధన్‌ సింగ్‌ రావత్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ప్రేమ్‌చంద్‌ అగర్వాల్‌, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.సంధు సహా అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తన పదవీ కాలానికి రెండేళ్ల ముందే రాజీనామా చేసిన బేబీ రాణి మౌర్య స్థానంలో కొత్త గవర్నర్‌గా సింగ్‌ వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఒక సైనికుడుగా దేశానికి సేవలందించిన తర్వాత ‘వీర్‌ భూమి’గా పిలవబడే ఉత్తరాఖండ్‌కు సేవలు అందించే అవకాశం నాకు వచ్చినందుకు గర్వంగా ఉంది’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img