Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ కర్‌ ప్రమాణ స్వీకారం

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగింది. ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆగస్ట్‌ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ధన్‌ కర్‌ విపక్షాలు మద్దతు పలికిన మార్గరెట్‌ అల్వాను ఓడిరచారు. ధన్‌ కర్‌కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ధన్‌ కడ్‌ కు ఏన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. వీటిలో నవీన్‌ పట్నాయక్‌ కు చెందిన బిజూ జనతాదళ్‌, వైసీపీ, మాయావతికి చెందిన బీఎస్పీ తదితర పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటింగ్‌ కు దూరంగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img