Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎంఎస్‌పీపై చర్చించాలి : రాకేష్‌ తికైత్‌

ముజఫర్‌నగర్‌ : వివాదాస్పద సాగు చట్టాలను పార్లమెంటులోనే రద్దు చేయడాన్ని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) జాతీయ అధ్యక్షుడు రాకేష్‌ తికైత్‌ స్వాగతించారు. అయితే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టం సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సిసౌలీలోని బీకేయూ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ…మూడు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో శీతాకాల సమావేశాల తొలి రోజున పార్లమెంటు వరకూ చేపట్టాలని భావించిన ట్రాక్టర్‌ మార్చ్‌ను రద్దు చేశారని గుర్తు చేశారు. సాగు చట్టాల రద్దు పూర్తి కావడంతో దిల్లీ సరిహద్దుల్లోని ఆందోళనను విరమించడంపై 40 రైతు సంఘాలతో కూడిన జాతీయ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తీసుకుంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img