Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎంపీ పాశ్వాన్‌పై అత్యాచారం కేసు

రాజకీయ కుట్ర అంటున్న ఎల్‌జేపీ
న్యూదిల్లీ : లోక్‌జనశక్తి ఎంపీ ప్రిన్స్‌రాజ్‌ పాశ్వాన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఎంపీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు మూడు మాసాల క్రితం ఫిర్యాదు చేసింది. ఆమె ఎల్‌జేపీ కార్యకర్త. అత్యాచారం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలు ధ్వంసానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. దీనిపై ఎల్‌జేపీ అధికార ప్రతినిధి శ్రవణ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ప్రిన్స్‌రాజ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే కేసు బనాయించారని ఆరోపించారు. అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 10వ తేదీన దిల్లీ పోలీసులకు ప్రిన్స్‌ రాజ్‌ ఫిర్యాదు చేశారని, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు పోలీసులకు చెప్పారని శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం ప్రిన్స్‌రాజ్‌పై 2020లోనే అత్యాచారం ఆరోపణ వచ్చింది. ప్రిన్స్‌రాజ్‌పై కేసు నమోదు చేయాలని సెప్టెంబరు 9వ తేదీన కోర్టు ఆదేశాలిచ్చిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ ప్రశ్నించలేదని పోలీసులు తెలిపారు. సమస్తిపూర్‌ ఎంపీపై అక్రమంగా కేసు బనాయించారని, న్యాయవ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందని, ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img