Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎక్కడి వారు అక్కడే ఉండాలి


పర్యాటకులకు హిమాచల్‌ ప్రభుత్వం హెచ్చరిక
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు మంగళవారం హెచ్చరిక జారీ చేసింది.హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వరదనీటితో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ కారణంగా స్థానిక ప్రజలు, పర్యాటకులు ఎక్కడి వారు అక్కడే ఉండాలని అధికారులు సూచించారు. భారీవర్షాలు వరదల వల్ల మాంరీa నది పొంగి ప్రవహిస్తోంది. వందలాది వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. వరదల వల్ల పలు రోడ్లపై కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాన్ని మంగళవారం మూసివేశారు. బార్డర్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ అధికారులు రోడ్లపై పడిన కొండచరియలను తొలగిస్తున్నారు.దీంతో అధికారులు, సహాయ పునరావాస సిబ్బంది సహాయక చర్యలకు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img