Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా?

అశోక్‌ గెహ్లాట్‌తో ప్రియాంక మంతనాలు
జైపూర్‌: ఎన్నికల తర్వాత పరిణామాలపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో చర్చించడానికిగాను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సోమవారం ఇక్కడికి వచ్చారు. మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రియాంకతో పాటు జైపూర్‌ విమానాశ్రయానికి వచ్చిన రాజీవ్‌శుక్లాకు గెహ్లాట్‌, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోత్సారా స్వాగతం పలికారు. ఐదు రాష్ట్రాల్లో గెలిచిన తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా, ఇతర పార్టీల్లోకి పారిపోకుండా చేయడంలో భాగంగా ప్రియాంక ముందస్తుగా గెహ్లాట్‌తో చర్చించారు. విమానాశ్రయంలో ఆమె కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ చాలా ఆలోచించి ప్రజలు ఓటేస్తారని చెప్పారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు గురించి ప్రశ్నించగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని ప్రియాంక చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల అనంతర పరిణామాలపై సీఎం గెహ్లాట్‌తో చర్చించడానికి ప్రియాంక వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. విమానాశ్రయం నుంచి సీఎం గెహ్లాట్‌తో కలిసి ప్రియాంక నేరుగా హోటల్‌కు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img