Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎయిరిండియా విమానానికి ‘బాంబు’ బెదిరింపు..హైఅలర్ట్‌

న్యూదిల్లీ : దిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న ఓ ఎయిర్‌ ఇండియా విమానంపై బాంబు దాడి చేయనున్నట్లు దిల్లీ పోలీసులకు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘‘భారత్‌ నుంచి లండన్‌కు వెళ్తున్న విమానంలో బాంబు పెట్టామని గురువారం రాత్రి 10:30 గంటలకు మాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దిల్లీ శివారులోని రన్‌హులా పోలీస్‌ స్టేషన్‌ ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ వచ్చింది. అమెరికాలో 9/11 దాడుల తరహాలో ఈ దాడి జరుగుతుందని కాలర్‌ మాతో చెప్పాడు’ అని దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం విమానాశ్రయంలో అధికారులు భద్రతను పెంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని దిల్లీ నైరుతి డీఎస్‌పీ ప్రతాప్‌ సింగ్‌.. ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి సరిగ్గా 20 ఏళ్లవుతున్న నేపథ్యంలో బెదిరింపు ఫోన్‌కాల్‌ ఆందోళనను రేకెత్తించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img