Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎయిర్‌లైన్స్‌కు రూ.19,564 కోట్ల నష్టం : కేంద్రం

న్యూదిల్లీ : కోవిడ్‌19 మహమ్మారి కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయని, దీంతో 202021 సంవత్సరానికి ఎయిర్‌లైన్స్‌కు రూ.19,564 కోట్లు, విమానాశ్రయాలకు రూ.5,116 కోట్ల నష్టం వాటిల్లినట్లు పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ సోమవారం చెప్పారు. కరోనా విజృంభణతో 2020 మార్చి 25 నుంచి మే 24 వరకు స్వదేశీ విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు వివరించారు. కరోనా ప్రభావం పౌరవిమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడిరదని రాజ్యసభకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఎయిర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కి ఎయిర్‌ ఇండియా రూ.2,350 కోట్లు, స్పైస్‌ జెట్‌ రూ.185 కోట్లు బకాయి ఉన్నట్లు మంత్రి వీకే సింగ్‌ చెప్పారు. బకాయిల వసూలుకు ఏఏఐ తీవ్ర ప్రయత్నం చేస్తోందని, నిరంతరం ఆ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి చెప్పారు. బకాయిల వసూలుకు సంబంధించి వడ్డీ విధించడం, సెక్యూరిటీ డిపాజిట్‌ చేయడం, చట్టపరమైన చర్యలకు ఏఏఐ శ్రీకారం చుట్టినట్లు మంత్రి సింగ్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా 125 విమానాశ్రయాలు ఏఏఐ అధ్వర్యంలో పనిచేస్తున్నాయి. తమ విమానాశ్రయాల నుంచి నడిచే విమానాల ల్యాండిరగ్‌, పార్కింగ్‌ చార్జీలను ఏఏఐ ఎప్పటికప్పుడు వసూలు చేస్తుంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img