Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏమి చర్యలు తీసుకున్నారు : త్రిపుర హైకోర్టు

అగర్తల : ముస్లిం మైనారిటీలపై జరిగిన హింసకు సంబంధించి త్రిపుర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో మత ఉద్రిక్తతల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటని విప్లవ్‌కుమార్‌ దేవ్‌ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మసీదు ధ్వంసం, ఇళ్లు, దుకాణాల విధ్వంసంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై నవంబరు 10వ తేదీ నాటికి సవివరమైన అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముస్లిం మైనారిటీలపై మతోన్మాదుల హింసను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సుమోటోగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి, జస్టిస్‌ సుభాశిష్‌ తలపత్రాలతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. హింసకు గురైన బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్న సీఎం విప్లవ్‌దేవ్‌ ప్రకటనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటూ సత్వరమే బాధితులకు పరిహారం అందించాలని ఆదేశించింది. మత ప్రదేశాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టిందని త్రిపుర అడ్వకేట్‌ జనరల్‌ సిద్ధార్థ శంకర్‌ డే ధర్మాసనానికి విన్నవించారు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన నకిలీ పోస్టులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img