Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో మరో ఐదుగురి గుర్తింపు

ఆర్మీ విమానాల్లో సొంతూళ్లకు భౌతికకాయాలు ..
న్యూదిల్లీ : ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సైనికుల్లో మరో ఐదుగురిని గుర్తించినట్లు సైన్యాధికారులు శనివారం తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో ఈ ప్రక్రియకు సమయం పడుతోందని అన్నారు. గుర్తించిన సైనికుల మృతదేహాలను వారి సొంతూళ్లకు పంపినట్లు వెల్లడిరచారు. మిగతా వారిని త్వరగా గుర్తించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. జూనియర్‌ వారెంట్‌ అధికారి (జేడబ్ల్యూఓ) ప్రదీప్‌, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్‌, జేడబ్ల్యూఓ రాణా ప్రతాప్‌ దాస్‌, లాన్స్‌ నాయక్‌ బి.సాయి తేజ, లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ల మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడిరచారు. శనివారం ఉదయం మృతదేహాలను కుటుంబాలకు అప్పటించినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. ఐదు విమానాల్లో మృతదేహాలను సొంతూళ్లకు తరలించామని, అక్కడ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారని అన్నారు. జేడబ్ల్యూఓ ప్రదీప్‌ భౌతికకాయం ఉదయం 11 గంటలకు సులూర్‌కు చేరుకోగా వింగ్‌ కమాండర్‌ చౌహాన్‌ మృతదేహం ఉదయం 9.45 గంటలకు ఆగ్రాకు చేరిందని అధికారులు తెలిపారు. జడబ్ల్యూఓ దాస్‌ భౌతికకాయం మధ్యాహ్నం ఒంటిగంటకు భువనేశ్వర్‌కు, లాన్స్‌ నాయక్‌ సాయి తేజ భౌతికకాయం మధ్యాహ్నం 12.30 గంటలప్పుడు బెంగళూరుకుÑ లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ భౌతికకాయం ఉదయం 11.30 గంటలకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని గగ్గల్‌కు చేరుకున్నట్లు వెల్లడిరచారు. సొంతూళ్లకు పంపే ముందు సైనికుల భౌతికకాయాలకు బేస్‌ హాస్పిటల్‌లోనే నివాళుర్పించినట్లు తెలిపారు. గుర్తింపు ఖరారు కానీ భౌతికకాయాలను దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీబేస్‌ ఆసుపత్రి శవగారంలో ఉంచారన్నారు. కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి దృష్ట్యా మృతదేహాల గుర్తింపు ప్రక్రియను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, స్వ్కాడ్రన్‌ నేత కె.సింగ్‌, హవిల్దార్‌ సత్పాల్‌, నాయక్‌ గుర్సేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేంద్ర కుమార్‌ల మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img