Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఐటి మంత్రి సభా హక్కుల ఉల్లంఘన

రాజ్యసభలో వినయ్‌ విశ్వం ఫిర్యాదు
పరిశీలిస్తామన్న వెంకయ్యనాయుడు

న్యూదిల్లీ: పెగాసస్‌ నిఘా వ్యవస్థ కొనుగోలుపై సభను తప్పుదోవ పట్టించడం ద్వారా కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణోవ్‌ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని సీపీఐ సభ్యుడు వినయ్‌ విశ్వం రాజ్యసభ చైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీి) నేతలతో కలిసి ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ, ప్రస్తుతం నోటీసు తన పరిశీలనలో ఉందనీ, మంత్రి నుంచి వివరణ తీసుకుంటామని చెప్పారు. తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఇజ్రాయిలో భారత్‌ కుదుర్చుకున్న రెండు బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో క్షిపణి వ్యవస్థతోపాటు ఎ కంపెనీ నుంచి పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు కూడా ఉన్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తా కథనాన్ని సీపీఐ, కాంగ్రెస్‌, టీిఎంసీి నేతలు ప్రస్తావించారు. 2017లో ఒప్పందం ఖాయమైన విషయాన్ని ఆ పత్రిక బయట పెట్టిందని తెలిపారు. ఎన్‌ఎస్‌ఈ గ్రూతో ఎలాంటి సంబంధం లేదని సభలో ప్రకటించడం ద్వారా ఐటి మంత్రి వైష్ణోవ్‌ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. పెగాసస్‌ స్పైవేర్‌ని వినియోగించి భారత్‌లో సుమారు 350 మంది ప్రముఖులపై నిఘా పెట్టినట్టు ‘ది వైర్‌’లో వచ్చిన వార్తలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. విపక్షాల నిరసనల మధ్య శీతాకాల, వర్షాకాల సమావేశాలు నామమాత్రంగా కొనసాగాయి. పెగాసస్‌పై చర్చకు కేంద్రం విముఖత చూపడం సమస్యకు ప్రధాన కారణం. న్యూయార్క్‌ టైమ్స్‌లో వార్త ప్రచురితమైన అనంతరం మోదీ సర్కారు ఇంకా ఎలాంటి విధాయక ప్రకటన చేయలేదు. ప్రభుత్వం మౌనం వీడాలని ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఫలితం లేదు. ఐటి మంత్రి సభను తప్పుదారి పట్టించారని సీపీిఐ సహా మూడు పార్టీల నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన నేపథ్యంలోనైనా ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img