Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం’ అనుసరిస్తే…: మోదీ

న్యూదిల్లీ: కుల వివక్షకు వ్యతిరేకంగా శ్రీ నారాయణ గురు అద్భుతంగా పోరాడారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని చెప్పారు. శివగిరి యాత్ర 90వ వార్షికోత్సవాలు, బ్రహ్మ విద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకల ప్రారంభం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. కేరళకు చెందిన శ్రీ నారాయణ గురు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త కూడా. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. వేడుకల ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, శ్రీ నారాయణ గురు బోధనలను, ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం’ సందేశాన్ని ప్రజలు అనుసరిస్తే, మన దేశాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ విభజించజాలవని తెలిపారు. ఆయన సందేశం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు మార్గదర్శనం చేస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌, నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img