Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఒక్కరోజే అర కోటికి పైగా టీకా డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో నిన్న 52.99 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య 46.15 కోట్లకు చేరుకుంది. 196వ రోజైన శుక్రవారం నాడు 35.40 లక్షల మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వగా.. 17.58 లక్షల మందికి సెకండ్‌ డోస్‌ ఇచ్చారు. దేశంలో టీకా కోసం స్వయంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న భిక్షగాళ్లు, నిరుపేదలు, అభాగ్యులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను శుక్రవారంనాడు ఆదేశించింది.కంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల మేరకు దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4,76,08,920 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2,14,14,837 వ్యాక్సిన్లు ఇచ్చారు. తెలంగాణలో 1,45,85,915 వ్యాక్సిన్లు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img