Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఒమిక్రాన్‌ గుర్తింపునకు ఎస్‌జీటీఎఫ్‌ స్ట్రాటజీ శ్రేయస్కరం

నాగపూర్‌ : కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ గుర్తింపునకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వస్తే నమూనాల జినోమ్‌ సీక్వెనింగ్‌ తప్పనిసరి అని పరిశోధకులు నొక్కిచెబుతున్నారు. ‘ఎస్‌’ జీన్‌ టార్గెట్‌ ఫెయిల్యూర్‌ (ఎస్‌జీటీఎఫ్‌) స్ట్రాటజీ ద్వారా కొత్త వేరియంట్‌ను సమర్థంగా గుర్తించగలమంటున్నారు. ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో దేశంలోని కోవిడ్‌ రోగ నిర్థారణ కీలక పరిశోధనకుల్లో ఒకరైన శాస్త్రవేత్త కృష్ణ ఖైర్నార్‌ పీటీఐతో మాట్లాడారు. వైరస్‌ను గుర్తించేందుకు టార్గెట్‌ చేసే వైరల్‌ జన్యుకణాలలో ‘ఎస్‌’, ‘ఎన్‌’, ఆర్‌డీఆర్పీ, ‘ఇ’ ముఖ్యమన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ‘ఎస్‌’ జన్యువు కీలకమని చెప్పారు. ఆర్టీపీసీఆర్‌లో థెర్మోఫిషర్స్‌ టాక్‌ పాథ్‌ ద్వారా ఈ మ్యుటేషన్‌ను గుర్తించలేకపోతున్నారని, ఓఆర్‌ఎఫ్‌, ఎన్‌ జన్యుకణాలను గుర్తించగలుగుతున్నారని తెలిపారు. ఇలా జరిగితే దానిని ‘ఎస్‌’ జీన్‌ టార్గెట్‌ ఫెయిల్యూర్‌ (ఎస్‌జీటీఎఫ్‌) పాజిటివ్‌ కేసుగా పరిగణిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ గుర్తింపునకు ఎస్‌జీటీఎఫ్‌ స్ట్రాటజీ శ్రేయస్కరమని నాగపూర్‌ సీఎస్‌ఐఆర్‌ఎన్‌ఈఈఆర్‌ఐకు చెందిన ఖైర్నార్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నమూనాల స్క్రీనింగ్‌కూ ఇది దోహదం చేస్తుందని చెప్పారు. ఆర్టీపీసీఆర్‌ దశలోనే ఒమిక్రాన్‌ రోగులను గుర్తిస్తే వైరస్‌ గొలుసును తెగొట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. కాంటాక్ట్‌ ట్రాకింగ్‌, క్వారంటీన్‌, కేసుల ట్రేసింస్‌, నమూనాల సీక్వెన్సింగ్‌తో ఆరంభంలోనే వైరస్‌కు చెక్‌ పెట్టొచ్చు అని ఖైర్నార్‌ అన్నారు. ఆర్టీ`పీసీఆర్‌, ఆపై జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పద్ధతుల్లో ఒమిక్రాన్‌ కేసులను త్వరగా గుర్తించవచ్చునని ఆయన వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img