Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కన్వర్‌ యాత్ర రద్దు


ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
థర్డ్‌ వేవ్‌ ముప్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో కరోనా నియంత్రణకు ఉత్తరఖాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కన్వార్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ గురువారం ప్రకటించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, దానికి తగినట్లుగానే నడుచుకుంటామని స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో కన్వర్‌ యాత్రను నిలిపేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మరోవైపు హరిద్వార్‌ ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడిరచారు. హరిద్వార్‌కు భక్తులు ఎవరూ రావొద్దని.. ఒకవేళ వస్తే 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తామని హరిద్వార్‌ పోలీసులు తెలిపారు. అయితే కన్వర్‌ యాత్రను ఉత్తరాఖండ్‌ రద్దు చేసినప్పటికీ.. యూపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img