Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కరోనా కేసులు 42,766.. మరణాలు 308

వరుసగా ఐదో రోజూ పెరిగిన ఉధృతి
న్యూదిల్లీ : వరుసగా ఐదోరోజు కూడా భారత్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. ఆదివారం 42,766 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ 3,29,88,673మంది వ్యాధి బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అలాగే తాజాగా 308 మరణాలు సంభవించడంతో మొత్తంగా 4,40,533మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా యాక్టివ్‌ కేసులు 4,10,048 ఉన్నాయి. రికవరీ రేటు 97.42కు చేరింది. గడచిన 24 గంటల్లో 4,367 కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 70 రోజుల్లో రోజూ 50వేలలోపు కేసులు నమోదవుతున్నట్టు వివరించింది. రోజువారి పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉండగా, వారంతపు పాజిటివిటీ రేటు 2.62గా నమోదువుతోంది. ఇప్పటి వరకూ 66.89కోట్ల వాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్టు పేర్కొంది. మరో 1.56 కోట్ల డోసులు పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 4.37 కోట్లు మిగిలి ఉన్న, ఉపయోగించని డోసులు ఉన్నాయని కేంద్రం వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img