Friday, April 19, 2024
Friday, April 19, 2024

కరోనా కొత్త కేసుల్లో తగ్గుదల.. 61 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోలిస్తే ఇవాళ కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైనే కేసులు నమోదుకాగా.. తాజాగా ఆ సంఖ్య 7 వేలకు దిగొచ్చింది. గత 24 గంటల వ్యవధిలో 7,633 కేసులు బయటపడ్డాయి.ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,27,271) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img