Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరోనా వైరస్‌ కట్టడిలో ఇండియానే బెటర్‌

: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ప్రపంచవ్యాప్తంగా 15-17 లక్షల కరోనా కేసులు నమోదవుతుంటే , ఇండియాలో రోజుకు కొవిడ్‌ కేసుల సంఖ్య 3,000 మాత్రమేనని ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే కరోనా వైరస్‌ (ఒమిక్రాన్‌) కట్టడిలో ఇండియానే ముందుందని చెప్పారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ జనాభాలో కేవలం 3.15 శాతం మాత్రమే కొవిడ్‌ బాధితులుంటున్నారని, ఇది ఫ్రాన్స్‌ (36.10 శాతం), యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (28.94 శాతం), యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (24.31 శాతం), స్పెయిన్‌ (24.07 శాతం), ఇటలీ (22.37 శాతం) కంటే చాలా తక్కువని ఆయన వివరించారు. అలాగే, భారత్‌లో మిలియన్‌ జనాభాకు 30,647 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 59,312గా ఉందని వెల్లడిరచారు. ఫ్రాన్స్‌లో ఈ సంఖ్య 3.6 లక్షలు, యూకేలో 2.89 లక్షలు, యూఎస్‌ఏలో 2.43 లక్షలు, స్పెయిన్‌లో 2.4 లక్షలు, ఇటలీలో 2.23లక్షలుగా ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img