Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో కేంద్రం రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రానున్న పండుగల సీజన్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రాలు వ్యూహాన్ని సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. సభలు, సమావేశాలు, తీర్థయాత్రల్లో పాల్గొనే వారిలో చాలామందికి కొవిడ్‌ సోకినా లక్షణాలు ఉండడం లేదని ఈ మేరకు అందరూ టీకాలు తీసుకునేలా చూడాలని, వారికి వ్యాక్సినేషన్‌ పూర్తైందనే విషయాన్ని నిర్ధారించుకోవాలని లేఖల్లో పేర్కొన్నారు. రాబోయే నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు, యాత్రలు జరిగే అవకాశం ఉందని, కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటి నుంచి సంబంధిత చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల్లో నిరసన పెరుగుదల కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యాత్రలు, సభలు, సమావేశాల వల్ల చాలామంది ఒక చోట నుంచి వేరే చోటికి ప్రయాణాలు చేస్తారని, దాంతో వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండే ప్రమాదం ఉందని రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. కాబట్టి దీనికోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించడానికి సకాలంలో అవసరమైన ప్రజారోగ్య చర్యలు తీసుకోవడం చాలా అవసరమని భూషణ్‌ తెలిపారు. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌ వ్యూహం మరింత దృష్టి సారించాల్సి అవసరం ఉందన్నారు. కొవిడ్‌పై ప్రచారం చేయడమే కాకుండా అనేక ప్రదేశాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img