Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కాంగ్రెస్‌,ఎన్సీపీలు ఉద్దవ్‌ను బలిపశువుని చేశాయి – మాజీ గవర్నర్‌ కోష్యారీ

మహారాష్ట్రలో చోటుచేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ పెదవి విప్పారు. ఓ ఆంగ్లచానల్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలపై మాట్లాడారు. శివసేన చీలిక, తన హయాంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సందేహా లకు బదులిచ్చారు. మాజీ సీఎంతో సంబంధాలను గుర్తుచేస్తూ, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్ట కుండా ఉండాల్సింది. సీఎం పదవికి సరి పోయే వ్యక్తి కాదు. సొంత పార్టీని నడిపిస్తే బాగుండేది. ఎన్‌సీపీకి చెందిన శరద్‌పవాల్‌, కాంగ్రెస్‌ పార్టీ లు కలిసి ఆయన కు సీఎం పదవిపై ఆశలు రేకెత్తించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. చివరకు బలిచ్చే గొర్రెపిల్లలా మార్చారు. నిజానికి ఉద్ధవ్‌ పట్ల నేను జాలిపడు తున్నాను అని కోష్యారీ చెప్పారు.ఎంవీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన 12 మంది అభ్య రు‰ల జాబితాను ఆమోదించక పోవడాన్ని కోష్యారీ సమర్థించుకున్నారు. చేయవలసినవి, చేయకూడనివి జాబితా చేస్తూ సీఎం ఐదు పేజీల లేఖ రాశారు. చివరికి నేను 15 రోజులలోపు లేదా అంతకు ముందు సంతకం చేయాలని చెప్పారు. ఈ విషయం కోర్టుకుచేరింది. గవర్నర్‌కు ప్రభుత్వం నిబంధనలను నిర్దేశించే రాజ్యాంగ రూల్‌ లేదు. సాధారణంగా సీఎం నాలుగు లైన్ల లేఖ రాస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. ఇంతకు ఆ లేఖ రాసిన సీఎం సలహారు కొత్తవారేం కాదు. నిబంధనలు బాగా తెలిసిన శరద్‌ పవార్‌ వంటి వారు అక్కడున్నారని చెప్పారు. ప్రభుత్వ విమానాన్ని కేటాయించకుండా ఉద్ధవ్‌ తీసుకున్న నిర్ణయంపై మాట్లాడుతూ, థాక్రే నన్ను విమానం నుంచి దించేశారు. విధి అతడిని సీఎం కుర్చీ నుంచి దించేసింది అని చెప్పారు.

వరుడు లేకుండా పెళ్లి సాధ్యమా?
బీజేపీ-షిండే కూటమిపట్ల పక్షపాత వైఖరి అవ లంబించారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు మెజారిటీ ఉంటే, ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తామని నా వద్దకు రావాల్సివుంది. కానీ అలా జరగలేదు. ఉద్ధవ్‌కు బదులుగా బీజేపీ ముందుకొచ్చింది. శివసేనకు వరుడు లేని పెళ్లి కావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? నేను ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ను కూడా అడిగాను. శరద్‌పవార్‌, భుజ్‌బల్‌తోనూ మాట్లాడాను. శివసైనికుడు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మాత్రమే చెప్పారు. మెజారిటీని నిరూపించే ఒక్క మద్దతు లేఖ కూడా ఇవ్వలేక పోయారని కోష్యారీ పేర్కొన్నారు. గవర్నర్‌గా నేను ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ఫడ్నవిస్‌కు మద్దతు ఉందని నమ్మాను కాబట్టే ప్రమాణస్వీకారం చేయించానని తన చర్యను సమర్థించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img