Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కాంగ్రెస్‌కి ఓటేస్తే..బీజేపీకి వేసినట్టే: కేజ్రీవాల్‌

న్యూదిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. గోవాలో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆప్‌, బీజేపీ మధ్య పోటీ నెలకొందని పేర్కొన్నారు. ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే అవుతుందని చెప్పారు. 2017లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి 17 స్థానాలు ఇస్తే అందులో చాలామంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని గుర్తు చేశారు. నాడు గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఆ పార్టీలో మిగిలారని తెలిపారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మళ్లీ బీజేపీలోకి వెళతారని ఆరోపించారు. బీజేపీని ఓడిరచాలంటే నీతి నిజాయతీ గల ఆప్‌ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తమ పార్టీ తరపున బరిలో ఉన్న 40 మంది అభ్యర్థులు భవిష్యత్తులో పార్టీ మారబోమని ముందుగానే ప్రతిజ్ఞ చేసిన అఫిడవిట్‌ను అందించారని చెప్పారు. నిజాయతీ గల నాయకులను ఎన్నికల బరిలో నిలిపినట్టు వివరించారు. ఓటర్లలో భరోసా నింపడంతో పాటు పార్టీ నిధి కోసం ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా ఉన్నట్టు ఓటర్లే చెప్పారని తెలిపారు. గోవాలో ఫిబ్రవరి 14న పోలింగ్‌, మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img