Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కాంగ్రెస్‌లో ‘కొత్త’ ముసలం

పార్టీ రాష్ట్ర విభాగాల్లో పెరిగిన అసమ్మతి
పంజాబ్‌ దారిలో హరియానా
‘నాయకత్వ మార్పు’ కోసం డిమాండ్‌
కేసీ వేణుగోపాల్‌ను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు
‘హుడా’కు కీలక పదవి కోసమే..?

న్యూదిల్లీ/హరియానా : కాంగ్రెస్‌లో కొత్త ముసలం పుట్టింది. పార్టీ రాష్ట్ర విభాగాల్లో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. పంజాబ్‌లో పార్టీ రాష్ట్ర విభాగంలో అంతర్గత పోరు నడుమ.. అదే దారిలో ఇప్పుడు హరియానా కాంగ్రెస్‌ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాకు ఒక కీలక పాత్ర కోసం లాబీయింగ్‌ చేస్తోన్న పార్టీ ఎమ్మెల్యేల గ్రూపు ఒకటి సోమవారం సీనియర్‌ నాయకుడు కె.సి.వేణుగోపాల్‌ను కలిసింది. రాష్ట్రంలో పార్టీకి ఒక ‘బలమైన నాయకత్వం’ కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో మరొక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిని కలిసిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది. పొరుగున పంజాబ్‌లో వర్గపోరును పార్టీ నాయకత్వం పరిష్కరిస్తున్నప్పటికీ ఈ రెండు సమావేశాలు హరియానా కాంగ్రెస్‌లో అసమ్మతిని స్పష్టం చేస్తున్నాయి. సోమవారం హుడాకు చెందిన దిల్లీ నివాసంలో సమావేశం జరిగింది. హరియానా అసెంబ్లీలో హుడా విపక్ష నాయకుడిగా ఉండగా, కుమారి సెల్జా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇదిలాఉండగా హుడా మినహా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారని, ఆ తర్వాత 22 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఆయనతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. హరియానాలో కాంగ్రెస్‌కు చెందిన 31 మంది ఎమ్మెల్యేలకుగాను మెజార్టీ సభ్యులు హుడా విధేయులుగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుల్దీప్‌ వత్స్‌ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘అనేక సంవత్సరాలుగా పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం జరగకపోవడంపై, అలాగే రైతుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితితోపాటు పార్టీ అంతర్గత విషయాలను మేము చర్చించాము’ అని తెలిపారు. వేణుగోపాల్‌ను కలవడానికి వెళ్లిన బి.బి.బాత్రా సమావేశం అనంతరం దిల్లీలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్ర పార్టీ విభాగంలో అంతర్గత పోరు అంశాన్ని ఖండిరచారు. కాగా కాంగ్రెస్‌ హరియానా సీనియర్‌ నాయకుడు కిరణ్‌ చౌదరి వేణుగోపాల్‌ను వేరుగా కలిశారు. ఇది ఒక సాధారణ సమావేశమేనని చౌదరి అభివర్ణించారు. ‘ఆయన మాకు పార్టీ ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శి. సీనియర్‌ నాయకుడు కూడా. నేను ఎప్పటికప్పుడు ఆయనను కలుస్తూనే ఉంటాను. ఈ రోజు జరిగిన మా సమావేశానికి నిర్ధిష్ట అజెండా ఏదీ లేదు. సీనియర్‌ నాయకత్వంతో సాధార ణంగానే సమావేశమవుతూ ఉంటా’ అని ఆమె వివరిం చారు. అయితే మంగళవారం కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్‌ను కలుస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హరియానా కాంగ్రెస్‌లో భారీ పునరుద్ధరణ అంశం ఎంతో కాలంగా పెండిరగ్‌లో ఉంది. నాలుగు రోజుల క్రితం హరియానా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 19 మంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ హరియానా వ్యవహారాల ఇన్‌ఛార్జి వివేక్‌ బన్సల్‌ను ఢల్లీిలో కలుసుకున్నారు. ఈ రెండు సమావేశాల సందర్భంగా, గత ఎనిమిదేళ్లుగా పార్టీ జిల్లా విభాగాల అధ్యక్షులను నియమించకపోవడాన్ని, రాష్ట్ర పార్టీని బలోపేతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో పదేళ్ల శిక్ష అనుభవించి మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్‌ చౌతాలా జైలు నుంచి విడుదల కావడం, రైతుల నిరసనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులలో పార్టీ రాష్ట్ర విభాగంలో హుడా పాత్ర కీలకమని, సంస్థాగత విషయాల్లో ఆయన అవసరం ఎక్కువని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. జైలు నుంచి చౌతాలా విడుదల కావడం వల్ల ఐఎన్‌ఎల్‌డీకి కలిగి ఏదైనా ప్రయోజనాన్ని దీటుగా ఎదుర్కొనేది ఒక ‘బలమైన నాయకుడు’ మాత్రమేనని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా గురువారం ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత బన్సల్‌ విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఎమ్మెల్యేలు ఎక్కువ సమావేశం కాలేదని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి వారి అభిప్రాయాలను, అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం, రానున్న పంచాయతీ ఎన్నికల గురించి వారి సలహాలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. అయితే బన్సల్‌తో సమావేశమైన హరియానా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) స్థాయిలో నాయకత్వ మార్పు ఉండాలని ఎమ్మెల్యేలు తెలియజేశారని అన్నారు. కాగా బన్సల్‌తో శాసనసభ్యుల సమావేశం విషయమై సెల్జా శుక్రవారం స్పందిస్తూ, ఎమ్మెల్యేలు పార్టీ హరియానా ఇన్‌ఛార్జిని కలవడంలో తప్పు లేదని అన్నారు. ‘ఎమ్మెల్యేలు తమ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిని కలిశారు. పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభాగం ఇన్‌ఛార్జిని కలిసి ఏదైనా చెప్పడాన్ని క్రమశిక్షణారాహిత్యంగా నేను చూడటం లేదు. అది వారి హక్కు. సమావేశం గురించి బన్సల్‌ సాహబ్‌ తర్వాత వివరణ ఇచ్చారు’ అని ఆమె తెలిపారు. అయితే గురువారం బన్సల్‌తో ఎమ్మెల్యేల సమావేశం తర్వాత పార్టీ అధి నాయకత్వంతో సెల్జా వేరుగా భేటీ అయ్యారు. పంజాబ్‌ పార్టీ రాష్ట్ర విభాగంలో అంతర్గత పోరు నడుమ హరియానా కాంగ్రెస్‌లో ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, సీనియర్‌ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img