Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాంగ్రెస్‌ నేత ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ కన్నుమూత

న్యూదిల్లీ : కేంద్ర మాజీమంత్రి ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ (80)కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. జులై 18న ఉదయం యోగా చేస్తుండగా ఆసనంలో పట్టు కోల్పోయి ఆయన కింద పడ్డారు. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీనిని ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్‌లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 1941 మార్చి 27న ఉడిపి (కర్ణాటక)లో జన్మించారు. 12మంది సంతానంలో ఆయన ఒకరు. చిన్నప్పటి నుంచి క్యాథలిక్‌ ఆచారాల మధ్య పెరిగారు. ఆయనకు బ్లాసవ్‌ ఫెర్నాండెజ్‌తో వివాహమైంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఫెర్నాండెజ్‌ అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ముఖ్యమైన బాధ్యతలు ఎన్నో చేపట్టారు. 1984, 1989, 1991, 1996లో ఉడిపి నుంచే పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు-రవాణా, కార్మికశాఖ మంత్రితో పాటు అనేక పదవులు చేపట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్‌ సేవలు అందించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెజ్‌ గుర్తింపు పొందారు. పార్టీ నిర్ణయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img