Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కాంగ్రెస్‌ బాగుపడదు.. ఇతరులను ముంచుతుంది: ప్రశాంత్‌ కిశోర్‌

కాంగ్రెస్‌ పార్టీపై ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ తనను తాను సరిదిద్దుకోకపోగా ఇతరులను ముంచుతుందని ఆరోపించారు. తన ట్రాక్‌ రికార్డ్‌ను చెడగొట్టుకుంటుందన్నారు. తాను ఒక్కసారి మాత్రమే ఓడిపోయానని, అది కూడా కాంగ్రెస్‌కు పనిచేసినప్పుడు అది జరిగిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీతో కలసి పనిచేయకూడదనుకున్నానని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చింతన్‌ శివిర్‌పై వ్యాఖ్యానిస్తూ పార్టీ దాని వల్లే పెద్ద ప్రయోజనం లేదన్నారు. కాగా ప్రశాంత్‌ కిషోర్‌తో కాంగ్రెస్‌ పార్టీ రెండు వారాల పాటు చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు ఫలించలేదు. అయితే ప్రశాంత్‌ కిషోర్‌ కొన్ని అధికారాలను, ఎన్నికల నిర్వహణలో స్వేచ్ఛను కావాలన్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌లో చేరాలని కిషోర్‌ను ఆహ్వానించారు. అయితే పాతుకుపోయిన కొన్ని నిర్మాణ సమస్యలను పరిష్కరించడానికి పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరమని చెప్పి ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ సందర్భంగా ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌లో భాగంగా పార్టీలో చేరాలనే కాంగ్రెస్‌ పార్టీ ఉదారమైన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img