Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కారు లోయలోపడి 8 మంది అయ్యప్ప భక్తులు మృతి

కొచ్చి/తిరువనంతపురం: కేరళలోని శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరిన ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు ప్రమాదంలో చిపోయారు. శుక్రవారం రాత్రి కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కుమిలి సమీపంలో అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తాపడి పక్కలో ఉన్న లోయలో పడి 8 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారని కేరళ పోలీసులు తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగా కారు చెట్టును ఢీకొని క్షణాల్లో లోయలో పడిరదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని సమాచారం. ఇడుక్కి జిల్లాలోని కుమిలి-కంబం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగిందని కేరళ పోలీసులు తెలిపారు. కారులో డ్రైవర్‌ తో సహ మొత్తం 10 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. ఈ పమాదంలో ఏడు మంది అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒకరు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 10 ఏళ్ల బాలుడు సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. తీర్థయాత్ర ముగించుకున్న అయ్యప్ప భక్తులు తమిళనాడులోని తేని జిల్లా అండిపట్టిలోని తన స్వగ్రామానికి తిరిగి వెలుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కేరళ పోలీసులు తెలిపారు. లోయ దాదాపు 60 అడుగుల లోతులో ఉందని, ప్రతికూల వాతావరణంలో లోయలో పడి చనిపోయిన అయ్యప్ప భక్లుల మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్‌కు చాలా గంటలు పట్టింది. కేరళలోని అటవీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో రాత్రి ప్రయాణాలు తగ్గించాలని కేరళ పోలీసులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img