Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాలుష్య కట్టడికి విద్యుత్‌ కర్మాగారాల మూసివేత

న్యూదిల్లీ : దిల్లీలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా దిల్లీ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఆరు థర్మల్‌ పవర్‌ విద్యుత్తు కేంద్రాలను ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. కేవలం నిత్యావసరాలను తరలించేవి తప్ప మరే ఇతర ట్రక్కులను దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోకి అనుమతించవద్దని పేర్కొంది. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణ రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. దిల్లీలో వాయుకాలుష్యం అడ్డుకట్టకు అత్యవసరంగా వాహనాల కదలికలు, పరిశ్రమల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించడంతో ఈ నిర్ణయం వెలువడిరది. ఇప్పటికే దిల్లీలో పాఠశాలలు 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ మాధ్యమంలో బోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు నిర్మాణ రంగ పనులను నిలిపివేశారు. ఏటా శీతాకాలంలో దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కొన్నేళ్ల నుంచి దీనికి పరిష్కారం కోసం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img