Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కేంద్ర బడ్జెట్‌ 2023-24..మహిళల కోసం ప్రత్యేక పథకం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్‌ టైమ్‌ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అవసరమైనపుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు.ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్‌ సమ్మాన్‌ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జనబాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మల తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img