Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేబుల్‌ బ్రిడ్జి ఘటనపై విచారణ జరిపించాలి: మల్లికార్జున ఖడ్గే

గుజరాత్‌లోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. ఐదు రోజుల క్రితమే సందర్శనకోసం ఈ బ్రిడ్జిని తెరిచారు.. అంతలోనే అంతమందిని అక్కడికి ఎవరు అనుమతించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలు అక్కడికి చేరుకున్నారు. గెహ్లోత్‌ కూడా అక్కడే ఉన్నారు. వీలైనంత సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ ఘటనపై ఎలాంటి రాజకీయం చేయదల్చుకోలేదు. ఎవరినీ నిందిచము. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే దీనిపై స్పందిస్తాం’’ అని మల్లికార్జున ఖడ్గే తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img