Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు

సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటన
కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో బుధవారం ఒక్క రోజే 22,056 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఈ నెల(జూలై) 31, ఆగస్టు 1న రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. కేరళలో కరోనా కేసులు రోజూరోజుకు పెరుగుతుండటంతో రాష్ట్రానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నుంచి ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించనుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కేరళ ప్రభుత్వానికి ఈ బృందం సహాయం చేస్తుదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 21న బక్రీద్‌ సందర్భంగా రెండు రోజుల పాటు ఆంక్షలను ఎత్తివేయాలని సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇలా కేసులు పెరిగిపోవడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img