Friday, April 19, 2024
Friday, April 19, 2024

కేరళలో మత విభజన సృష్టిస్తోన్న బీజేపీ

సీపీఎం సీనియర్‌ నాయకుడు ప్రకాష్‌ కారత్‌

తిరువనంతపురం : కేరళలో ఇస్లాం ఫోబియోను రెచ్చ గొట్టడం ద్వారా బీజేపీ మతపరమైన విభజనను సృష్టి స్తోందని సీపీఎం సీనియర్‌ నాయకుడు ప్రకాష్‌ కారత్‌ శుక్ర వారం విమర్శించారు. ఈ దక్షిణాది రాష్ట్రంలో లవ్‌, నార్కోటిక్‌ జిహాద్‌ ఆరోపణలు చేసిన కాథలిక్‌లు.. కాషాయ పార్టీ అసలు స్వరూపం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ముస్లింయేతర యువతకు వ్యతిరేకంగా లవ్‌ జిహాద్‌, నార్కోటిక్‌ జిహాద్‌ నిర్వహిస్తు న్నారంటూ ఇటీవల సిరోమలబార్‌ కాథలిక్‌ చర్చి పాల డియోసెస్‌ బిషప్‌ జోసెఫ్‌ కల్లరంగట్‌ చేసిన ఆరోప ణలను ప్రస్తావిస్తూ, ఈ విస్తృత ఆరోపణ కేరళ సమా జంలో ఆందోళన, అపనమ్మకానికి కారణమైందని పార్టీ పత్రిక దేశాభిమానిలో రాసిన ఒక వ్యాసంలో పేర్కొ న్నారు. బిషప్‌ ఆరోపణలకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ‘ఇస్లాం ఫోబియోను రెచ్చగొట్టడానికి, ముస్లిం, క్రైస్తవ సమాజాల మధ్య చీలికను తీసుకురావడానికి బీజేపీకి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ముస్లిం యేతర మహిళలు లక్ష్యంగా లవ్‌ జిహాద్‌ ఆరోపణలు వంటి వ్యవస్థీ కృత ప్రయత్నమేదీ లేదని రాష్ట్ర పోలీసులు, ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడయిందని తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌లు ఉమ్మడిగా ముస్లిం సమాజాన్ని అణగదొక్కేందుకు, మరో వైపు, క్రైస్తవ మతాధికారులను తమ వైపునకు తిప్పుకునేం దుకు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నా యని కారత్‌ విమర్శించారు. కేరళలో క్రైస్తవులలో అత్యంత విలువ కలిగిన కాథలిక్‌ చర్చి.. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ల అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని కోరారు. మతపరమైన మైనార్టీలయిన ముస్లింలు లేదా క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులు నిరంతరంగా ప్రచారం చేస్తున్నా యని అన్నారు. ‘ప్రాసిక్యూషన్‌ రిలీఫ్‌’కు చెందిన ఒక నివేదిక ప్రకారం, 2016 నుండి 2019 వరకు దేశ వ్యాప్తంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా 1,774 కేసులు నమోదయ్యాయని వివరించారు. 1921 మలబార్‌ తిరుగుబాటును వక్రీకరించే విధంగా సంఫ్‌ు పరివార్‌ శక్తులు వ్యవహరిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img