Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేరళ కాంగ్రెస్‌ తీరుని తప్పుపట్టిన చెన్నితల

కొట్టాయం : కేరళ కాంగ్రెస్‌ పనితీరుపై ఆ పార్టీ నాయకులే విమర్శలు గుప్పించారు. పార్టీ చీఫ్‌, కేపీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్‌, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీసన్‌ పనితీరును కేరళ కాంగ్రెస్‌లో ముఖ్యనాయకలు రమేశ్‌ చెన్నితల తప్పుపట్టారు. వారి సారధ్యంలో పార్టీ నిర్వహణ నిర్లక్ష్యంగా సాగుతోందని విమర్శించారు. 14 మంది డీసీసీ చీఫ్‌లను ఎన్నుకునేటప్పుడు తనను, చాందీని గానీ సంప్రదించలేదని చెన్నితల అన్నారు. తాను పార్టీ సాధారణ సభ్యుడినైనా, చాందీ ఒక సీనియర్‌ నేతని, ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీగా పనిచేశారని, పార్టీలో జరిగే నిర్ణయాలను ఆయనకు వివరించాల్సి ఉందని చెన్నితల అన్నారు. సుధాకరన్‌ పార్టీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, పార్టీలో క్రమశిక్షణ తీసుకురావాల్సి ఉందని పార్టీ వర్గాలు కన్నూర్‌లో పేర్కొన్న నేపథ్యంలో చెన్నితల ఈ వ్యాఖ్యలు చేశారు. తాను, చాందీ పార్టీని 17 ఏళ్ల పాటు నడిపామని, తమ నాయకత్వంలో పార్టీలో ఈ తరహా నిర్లక్ష్య వైకరి లేదని, అందరినీ కలుపుకుని ముందుకు సాగామని, సొంత ప్రయోజనాల కంటే ప్రార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా సాగామని చెన్నితల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img