Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేర‌ళ స్టోరి మూవీ నిలిపివేత‌కు సుప్రీం నో…

విడుద‌ల‌కు ముందే దేశవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు
‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు ఆదేశాలివ్వా లన్న అభ్యర్థనను సుప్రీంకోర్ట మంగళవారం తోసిపుచ్చింది. ఈ చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు ఆమోదించిందని, కనుక నిలిపివేయమని ఆదేశించడం కుదర దని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నమ్మలతో కూడిన ధర్మాసనం పేర్కొం ది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదిస్తూ ఈ చిత్రంలో ద్వేష ప్రసంగాలు ఉన్నాయని అన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం… సెన్సార్‌ బోర్డుపై కేసు వేయాలని పిటిషనర్‌కు సూచించారు. దాంతో సెన్సార్‌ బోర్డుపై దావా వేస్తామని కపిల్‌ సిబల్‌ కోర్టుకు విన్నవించుకున్నారు. సినిమా టీజర్‌ను ఇప్పటికే 16 లక్షల మంది వీక్షించారని, ఈ దశలో చిత్ర ప్రదర్శనను నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నం సృష్టిస్తున్న మూవీ
మతమార్పిడులు, ఐసిస్‌ మూలాలు, లవ్‌ జిహాద్‌ వంటి వివాదాలకు కేరాఫ్‌ కేరళ. గత దశాబ్ద కాలంలో ఈ అంశాలు అక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దేశవ్యాప్తంగాను సంచలనంగా మారాయి. జాతీ య దర్యాప్తు సంస్థలు కూడా ఇక్కడి ఉగ్రమూలాల డొంకను కదిలించి, ఉగ్రభూతం ఊడల జాడల్ని బయటకిలాగాయి. ఇక్కడి యువత ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదంలో చేరారని, పాకిస్తాన్‌, అఎn్గానిస్తాన్‌, ఇరాక్‌, సిరియా వరకు వెళ్లారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘ది కేరళ స్టోరీ’ పేరుతో తెరకెక్కిన సినిమా ప్రకంపనలు సృష్టి స్తోంది. సామాజికంగాను, రాజకీయంగాను అలజడి రేపు తోంది. కేరళ నుంచి 32వేల మంది అమ్మాయిలు తప్పిపోవ డం.. వారి అదృశ్యం వెనుక కారణాలు.. తదంనంతర పరిణా మాలే ఈ సినిమా కథాంశం. ఇందులో బ్రెయిన్‌ వాష్‌, లవ్‌ జిహాద్‌, హజాబ్‌, ఐసిస్‌ వంటి పదాలను పదేపదే వాడటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా ట్రైలర్‌ ఉత్కంఠతను, ఆందోళనను కలిగిస్తోంది. ఐసిస్‌ ఉగ్రమూలాలతో సంబం ధం ఉందనే భావనే ఇందుకు కారణం. ఏప్రిల్‌ 26న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా చూశారు. కొందరు ఈ సినిమా కథను కల్పనగా కొట్టి పారేస్తుంటే, మరికొందరు మాత్రం వాస్తవికత కాబోలు అంటున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img